యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు చాలా వరకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లనే వసూలు చేస్తుంది. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం వారు హిందీ మార్కెట్ పై గట్టి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా చాలా రోజుల పాటు హిందీ లో ప్రచారాలను కూడా చేశారు. కూడా ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు హిందీ ఏరియా నుండి వచ్చాయి. ఇకపోతే మొదటి వీక్ డే రోజు మాత్రం ఈ సినిమాకు హిందీ ఏరియాలో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మరి ఈ మూవీ కి మొదటి మూడు రోజులు హిందీ ఏరియాలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. మొదటి వీక్ డే రోజు ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు హిందీ ఏరియా లో వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు హిందీ ఏరియాలో 7.95 కోట్ల కలెక్షన్లు రాగా , రెండవ రోజు 9.50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 3 వ రోజు 12.07 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా మొదటి మూడు రోజులు ఈ సినిమాకు ఒక రోజును మించి మరొక రోజు కలెక్షన్లు వచ్చాయి. కానీ మొదటి వీక్ డే రోజు మాత్రం ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మొదటి వీక్ డే రోజు ఈ సినిమాకు హిందీ ఏరియాలో కేవలం 4.40 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి హిందీ ఏరియాలో 33.92 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఒక ఓ విధంగా చూసుకుంటే ఈ సినిమాకు హిందీ ఏరియాలో సూపర్ సాలిడ్ కలెక్షన్లు నాలుగు రోజుల్లో దక్కాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: