డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు మూవీ లవర్స్. ఆర్జీవీ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సెన్సేషనల్. మొత్తానికి వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఎన్నో సినిమాలు తీసేవాడు. కానీ, ఇప్పుడు తనకు ఇష్టం వచ్చినప్పుడూ .. ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. అంతే కాదు.. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉంటాడు. వర్మ నుండి సినిమా వస్తుందంటే సినీ లవర్స్ , అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఆసక్తి కనపరిచేవారు. అలాంటి వర్మ..ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అయ్యాడు. ఇప్పుడు వర్మ నుండి సినిమా వస్తుందంటే కనీసం ప్రమోషన్ ఖర్చుల అంత కూడా వస్తాయా..? అని మాట్లాడుకుంటున్నారంటే వర్మ ఇంతకు పడిపోయారో అర్ధం చేసుకోవాలి. సినిమా కథల ఫై కంటే ఇతర విషయాల ఫై ఎక్కువ ఫోకస్ పెడుతూ దిగజారిపోయాడు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఆయన ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన ఓ పోస్ట్  చేసాడంటే అది వైరల్ అవ్వాల్సిందే. ఎవరికీ భయపడకుండా మనసులో ఏమనిపిస్తే అది బయటకు చెప్పేయడం వర్మ ప్రత్యేకం. అందుకే చాలామంది నెటిజన్లు ఆయన్ను ఫాలో అవుతుంటారు.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన లైఫ్ లో జరిగిన ఓ సంఘటను తెలియజేసారు.నేను నా భార్య ఇద్దరం సినిమాకు వెళ్లాం. కానీ, ఆ సినిమా బాగాలే ఇంటికి వచ్చాం. ఆ సమయంలో తన పనిమనిషి వేరే పరాయి వ్యక్తితో కనిపించింది. 

వాస్తవానికి ఆ విషయం నేను గమించలేదు. నా భార్య వారిద్దరూ కలిసి ఉండటానికి చూసి.. గట్టిగా అరిచింది. ' వెంటనే నేను అక్కడికి వెళ్లి రెండు విషయాలు చెప్పాను. ఒక్కటి తాను మన పనిమనిషి తాను ఏంటో? తన సెక్స్ లైఫ్ ఏంటో? వేరు. ఎవరితో సెక్స్ ఎఫైర్ పెట్టుకుంటుందో అని నీకు సంబంధం లేదు. అనవసరం. రెండోది మనం లేనప్పుడు వేరు వ్యక్తి ఇంట్లో రానిస్తుందనడం అది మన ఇంటి సెక్యూరిటీ విషయం. ఈ విషయంలో ఆ పనిమనిషికి వార్నింగ్ ఇస్తావా? లేదా పనిలో నుంచి తీసివేస్తావా? అనేదే నీ నిర్ణయం. కానీ తన సెక్స్ లైఫ్ తో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని గుర్తుకు పెట్టుకోని చర్య తీసుకో' అని తన భార్యకు చెప్పానని తనదైన శైలి చెప్పారు ఆర్జీవీ. 'ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్క రకంగా ఫీల్ అవుతుంటారు. వేరే వ్యక్తి అయితే  ఆ పని మనిషిని కొట్టవచ్చు. మరో వ్యక్తి అయితే.. తిట్టి ఊరుకోవచ్చు. కానీ, తన వ్యక్తిగత జీవితంపై మనం కమైండ్ చేయడం సరికాదు. ఉదాహరణకు ఓ దొమ్మ కుడితే వేరేలా ఫీల్ అవుతాం వేరే ఏదైనా కుడితే మరోలా ఫీల్ అవుతాం. ప్రతి యాక్షన్ కు రియాక్షన్ కూడా వేరేలా ఉంటుంది. అలాగే మన ఫేమ్ చేసుకున్న వర్క్ మూడ్ లో వేరే వ్యక్తి ఎంటర్ అయితే.. మరోలా ఫీల్ అవుతాం. వ్యక్తిని బట్టి. పరిస్థితిని బట్టి మనం పవర్తించే విధం కూడా మారవచ్చు' అంటూ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: