సెలబ్రిటీలకు పెళ్లిళ్లు ప్రేమలు అనేవి చాలా కామన్.. కొంతమంది అయితే ఎన్ని రిలేషన్స్ బయటపడితే అంత ఫేమస్ అయిపోతామని అనుకుంటారో ఏమో తెలియదు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ మరీ దారుణంగా తయారవుతుంది అంటున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు.పెళ్లి అనే బంధానికి కట్టుబడి ఉండకుండా పెళ్లయిన రెండు మూడు నెలలకే చిన్న చిన్న గొడవల కారణంగా విడాకులు తీసుకుంటూ వివాహ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు అంటున్నారు. అయితే ఈ మాటలన్నీ మాట్లాడుకోవడానికి ఓ హీరొయిన్ కారణమైంది.మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఆమె గురించి ఇన్ని మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే  ఆ హీరోయిన్ తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైంది.ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని వారికి విడాకులు ఇచ్చేసిన ఈ బ్యూటీ తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైంది.అయితే పెళ్లిడుకోచ్చిన కూతుర్ని పెట్టుకొని అల్లుడు వచ్చే స్టేజీలో మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోయిన ఆమె ఎవరో కాదు వనిత విజయ్ కుమార్.. ప్రముఖ నటినటులు మంజుల, విజయ్ కుమార్ ల కూతురు వనిత విజయ్ కుమార్ అంటే తెలియని వారు ఉండరు.ఈమె తెలుగు కంటే ఎక్కువగా తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. 

ఇక తెలుగులో ఈమె దేవి సినిమాలో చేసింది. అలాగే నరేష్ పవిత్ర లోకేష్ కలిసిన నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి క్యారెక్టర్ లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుంది.తాజాగా నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రియుడిని పరిచయం చేసి పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేసింది.వనిత విజయ్ కుమార్ మొదట ఆకాష్ ని పెళ్లి చేసుకుంది.ఆయనతో కొడుకు, కూతురు పుట్టాక విడాకులు ఇచ్చేసి తర్వాత బిజినెస్ మాన్ అయినటువంటి ఆనంద్ జయ దర్శన్ ని రెండో పెళ్లి చేసుకొని ఆయనతో కూడా ఓ కూతురికి జన్మనిచ్చింది.కానీ ఆయనతో కూడా ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది.


ఆ తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో డేటింగ్ లో ఉండి సడన్గా ఫోటోగ్రాఫర్ అయినటువంటి పీటర్ పాల్ ని మూడో పెళ్లి చేసుకుంది. అయితే ఆయనతో కూడా బ్రేకప్ అయ్యాక నేను పీటర్ ని పెళ్లి చేసుకోలేదు కేవలం నిశ్చితార్థం మాత్రమే చేసుకున్నాను అని ట్విస్ట్ ఇచ్చింది. అయితే తాజాగా మూడో బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో మళ్ళీ ప్యాచప్ అయ్యి ఆయనతో పెళ్లికి రెడీ అయిపోయింది. తాజాగా ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన పెళ్లి డేట్ ని కూడా అనౌన్స్ చేసింది. అక్టోబర్ 5 న పెళ్లి చేసుకోబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పడంతో చాలామంది షాక్ అవుతున్నారు. అయితే వనిత విజయ్ కుమార్ కి పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది ఇలాంటి సమయంలో నాలుగో పెళ్లి చేసుకోవడం ఏంటి అని చాలామంది ఈమె పెళ్లి పోస్ట్ పై కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: