క్యాస్టింగ్ కౌచ్ నేపధ్యంలో కేరళలో ఏర్పడిన హేమ క‌మిటీ ఇపుడు అన్ని సినిమా పరిశ్రమలలో కూడా కలకలం సృస్టిస్తోంది. ఇక క్యాస్టింగ్ కౌచ్ వివాదాలు మన తెలుగు పరిశ్రమకు కూడా కొత్తేమీ కాదు. తాజాగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ ఇదే విషయంలో అరెస్ట్ అయ్యి, జైలులో ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ రోజుల్లోనే అలాంటివి ఉండేవి. ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదు అన్న వ్యాఖ్యలు కూడా మనకి వినబడుతున్నాయి. ఎందుకంటే, అప్పట్లో కొంద‌రు అగ్ర హీరోలు మోటైన స‌ర‌సం గురించి గుస‌గుస‌లాడుకున్న రోజులున్నాయి.

అదంతా పక్కన పెడితే, అలాంటి పురుషాధిక్య ప్రపంచంలో ధీటైన స్టార్ గా కొన్నేళ్ల పాటు ఏలిన ఒక న‌టి బాల‌న‌టిగా తెరంగేట్రం చేసిన‌ప్పుడు ఒక బ‌ల‌వంత‌పు బలాత్కారాన్ని చ‌వి చూసిందట. ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక నటుడు తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడనే విషయాన్ని ఓ మీడియా వేదిక ద్వారా ఆమె చెప్పుకు రావడంతో ఆ అవ్యక్తి ఎవరా అంటూ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వెతుకేస్తున్నారు జనం.

ఆమె మరెవ్వరో కాదు... మేటి అందాల తార రేఖ‌. ఆమె రేఖ‌: ది అన్‌టోల్డ్ స్టోరీ పేరుతో తన జీవిత చరిత్రలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె నటించిన దో షికారీ (గతంలో అంజనా సఫర్ అనే టైటిల్) సినిమా సెట్స్‌లో ఈ సంఘటన జరిగినట్టు రాసుకొచ్చింది. సూపర్‌స్టార్ బిశ్వజిత్‌తో రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని తనకు తెలియజేయకుండా ముద్దు పెట్టుకున్నాడని ఆమె అందులో వెల్లడించింది. ఆ సమయంలో దర్శకుడు కుల్జిత్ పాల్ కూడా దానిని ఖండించకపోవడంతో షాక్ కి గుర‌య్యాన‌ని తెలిపారు. బిశ్వజిత్ తనను చాలా సేపు ముద్దుపెట్టుకున్నాడని, అది తనకి చాలా అసహ్యం అనిపించిందని వాపోయింది రేఖ. మరోవైపు బిశ్వజిత్ ఈ ఆరోపణలను తరువాత ఖండించారు. దర్శకుడి సూచన మేరకే తాను అలా చేశానని వెల్లడించడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: