సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శివ, రంగీలా, సర్కార్ వంటి సినిమాలతో ఆర్జీవీ పేరు దేశం అంతటా వినబడింది. ఇప్పుడు పాన్ ఇండియా అంటే, దర్శకుడు రాజమౌళి అంటున్నారు కానీ, ఒకప్పుడు మాత్రం ఆర్జీవీ పేరు మాత్రమే వినబడేది. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తూ, తన పేరుని తానే చెడగొట్టుకుంటున్న వైనం అందరికీ తెలిసిందే. అయితే, ఆర్జీవీని ఇన్సిరేషన్ గా తీసుకుని ఎంతోమంది సినీ పరిశ్రమలోకి డైరెక్టర్లు అవ్వాలని వచ్చారు, ఇపుడు తెలుగు సినిమాని ఏలుతున్నారు కూడా.

అవును, ఇప్పటికి చాలా మంది ఆర్జీవీ అభిమానులు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒకరు. తీసిన 3 సినిమాలతోనే సందీప్ స్టార్ డైరెక్టర్ లెవల్ కు ఎదిగారు అనడంలో అతిశయోక్తి లేదు. రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి తీసిన యానిమల్ సినిమా ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. తాజాగా జరిగిన ఐఫా వేడుకల్లో యానిమల్ సినిమా బెస్ట్ ఫిలిం, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ నెగిటివ్ రోల్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైన్.. ఇన్ని విభాగాల్లో అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.

ఇక యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డినే ఎడిటర్ కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు కూడా సందీప్ వంగాని వరించింది. ఈ క్రమంలో స్టేజి మీద సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఈ విభాగంలో అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా రేర్ అవార్డు. నేను ఎడిటింగ్ కేవలం ఆర్జీవీ సర్ సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను. మీ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను, థ్యాంక్యూ ఆర్జీవీ సర్! అని మాట్లాడాడు సందీప్. దాంతో ఆర్జీవీ సదరు వీడియోని పోస్ట్ చేస్తూ.. సర్ సందీప్! మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, ఆయాండ్ ర్యాండ్ మీ మీద ఒట్టేసి చెప్తున్నా! నేను ఇప్పుడు మీ దగ్గర ఫిలిం మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది అని రిప్లై ఇచ్చారు. దీనికి సందీప్ రెడ్డి వంగా సర్.. అంటూ దండం పెట్టే ఎమోజితో రిప్లై ఇచ్చారు. దాంతో ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV