తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన అందమైన ప్రేమ కథలలో అల్లు అర్జున్ ఆర్య కూడా ఒకటి.. టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ తొలి సినిమాగా తెర్కెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కథ కొత్తగా ఉండటం పాటలు అద్భుతంగా ఉండటంతో యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అందించిన బిజిఎం పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అద్భుతంగా తన పాత్రలో లీనమై నటించాడు.. ఫీల్ మై లవ్ అంటూ బిగ్ స్క్రీన్ పై మాయ చేసాడు. ఎప్పటికీ సుకుమార్ బ‌న్నీ కేరీర్‌లో ఇది ఒక మెమ‌ర‌బుల్ సినిమాగా మిగిలిపోయింది.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా అను మెహతా నటించింది.. త‌న అందం అభినయంతో పాటు తన అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ భామ. తొలి సినిమాతోనే యువత మన‌సుల‌ను గెలుచుకుంది. కానీ ఆ తర్వాత  తెలుగులో స్టార్‌డ‌య్‌ అందుకోలేకపోయింది. టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. తర్వాత కొన్ని అనుకోని కారణాలతో నటనకు దూరమైంది అను మెహత.. టాలీవుడ్ లో ఆర్య తర్వాత నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ  వంటి సినిమాల్లో నటించిన‌ అనుకు ఆర్య తప్ప మరో సరైన హిట్ అందలేదు.

అయితే తెలుగులో ఈ సినిమా తర్వాత అసలు అను మెహత ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంది అనే విషయాలు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు అను మెహతా లేటేస్ట్ ఫోటో అంటూ ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో అను ఏమాత్రం తరగని అందంతో మాయ చేస్తుంది. అయితే ఈ పిక్ ఎప్పటిది అనేది తెలియరాలేదు. కానీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అను మెహతా.. ఇప్పుడేం చేస్తుందనేది తెలియరాలేదు. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: