చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలన్నా నిర్మాతలకు భారీ లాభాలు కావాలన్నా ప్రేక్షకుల ఆదరణ బాగుంటేనే అది సహకారం అవుతుంది అప్పుడే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చెవులు సినిమాను చూస్తేనే కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ అవుతాయి. అలాంటిది ఆడవాళ్లు థియేటర్స్ కి రాకపోయినా సినిమా సూపరే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమాలు కూడా ఉన్నాయంటే ఎవరు నమ్మరు.. అలాంటి సినిమా ఉండదని కూడా అంటారు.


కానీ ఆ మాటలను అబద్ధం చేస్తూ మహిళ ప్రేక్షకులు లేకుండా రికార్డర్ స్థాయిలోకలెక్షన్లు సాధించిన సినిమా ఏమిటంటే సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు.. శ్రీ పద్మాలయ మూవీస్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మించిన తొలి సినిమా కూడా ఇదే. తెలుగు చిత్ర పరిశ్రమలోనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సంచ‌ల‌న‌ నిర్ణయాలు తీసుకోవటంలో కృష్ణకు ఎవరు సాటిలేరు అనేది ఇప్పటికీ అందరూ అంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఆయన చేసే సినిమాలు ఎంపికిలోను ఎంతో దూకుడుగా వెళ్లే వారు కృష్ణ. అలా ఇండియాలో ఎవరూ చేయని విధంగా కౌబాయ్‌ జోనర్‌లో సినిమా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.


కేవ‌లం రూ.7 లక్షల బడ్జెట్‌తో సినిమాని కంప్లీట్‌ చేశారు. ఇలా కృష్ణ చేసిన ప్రయోగం సక్సెస్‌ అయ్యింది. ఆడియన్స్‌ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. అప్పటివరకు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు మోసగాళ్ళకు మోసగాడు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ నిచ్చింది. మహిళా ప్రేక్షకుల ఆదరణ ఉంటేనే సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో కృష్ణ నిరుత్సాహపడలేదు. తప్పకుండా సినిమాకి మంచి కలెక్షన్స్‌ వస్తాయి అని ఊహించారు. ఆయన అనుకున్నట్టుగానే కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలు తెచ్చిపెట్టింది మోసగాళ్లకు మోసగాడు. ఆరోజుల్లో ఈ సినిమా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఆరోజుల్లో రీరిలీజ్‌ అనేది సాధారణ విషయం. మళ్లీ మళ్ళీ హిట్‌ అయిన సినిమాలను రిలీజ్‌ చేస్తూ ఉండేవారు. అలా మోసగాళ్ళకు మోసగాడు చిత్రాన్ని ఎన్నిసార్లు రీరిలీజ్‌ చేసినా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో రన్‌ అయ్యేది. ఫస్ట్‌ రిలీజ్‌లోనే కాదు, రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్‌ చేసింది. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ, కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ కాంబినేషన్‌లో రూపొందిన మోసగాళ్ళకు మోసగాడు ఒక బెంచ్‌ మార్క్‌ మూవీగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: