ఎన్‌టి‌ఆర్ నటించిన ‘దేవర’ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోందనే చెప్పుకోవాలి. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటి గంట నుండే దేవర జాతర మొదలవ్వడంతో 3 రోజుల్లోనే ఏకంగా 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు రాబట్టి దేవర సత్తా చాటింది. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడం, ఆ తర్వాత నుంచి దసరా సెలవులు ఉండటంతో, మరో వారం రోజులు పాటు కూడా దేవరకు ఢోకా లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 300 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టల్సి ఉంది. ఈలోపునే ఈ సినిమా సక్సెస్‌ను సలెబ్రేట్ చేయడానికి దేవర చిత్ర యూనిట్ రెడీ కావడంతో, కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికైతే.. దేవర సినిమా తెలుగు ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. హైదరాబాద్‌ నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తారక్ అభిమానులు పోటెత్తడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి విదితమే. దీంతో.. టైగర్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఈ నేపధ్యంలోనే దేవర సక్సెస్ మీట్‌తో అయినా ఎన్టీఆర్ అభిమానులను కూల్ చేయవచ్చనే నిర్ణయానికి వచ్చారట!

అక్టోబర్ 2 లేదా 3వ తేదీన దేవర సక్సెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తారా? లేదంటే, ఏపీలో ప్లాన్ చేస్తారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దేవర యూనిట్ లొకేషన్‌ కోసం సెర్చింగ్‌లో ఉన్నారట. హైదరాబాద్‌లోనే ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని అనుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు విశ్లేషకులు ఏమంటున్నారంటే, సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాకముందే పండగ ఎందుకు చేసుకుంటున్నారో అర్ధం కావడం లేదని!

మరింత సమాచారం తెలుసుకోండి: