తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత ఈయనకు వరుస అపజయాలు దక్కాయి. అలాంటి సమయంలోనే ఈయన ఇష్క్ అనే మూవీ తో సూపర్ సక్సెస్ను అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అలా ఇష్క్ మూవీ తో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఈయన గుండెజారి గల్లంతయ్యిందే అనే మూవీ తో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మూవీ కి విజయ్ కుమార్ దర్శకత్వం వహించగా ... నిత్యా మీనన్ , ఇషా తల్వార్మూవీ లో నితిన్ కి జోడిగా నటించారు. ఈ మూవీ ద్వారా ఇషా తల్వారి కి మంచి గుర్తింపు తెలుగు పరిశ్రమలో దక్కాయి. కానీ ఆ తర్వాత ఈమెకు భారీ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కలేదు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో ఈ నటి గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో పాటు మైనే ప్యార్ కియా , రాజా చెయ్యి వేస్తే అనే సినిమాలలో నటించింది. కానీ గుండెజారి గల్లంతయితే తప్పితే మరే సినిమా కూడా మంచి విజయం సాధించలేదు. ఇక సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తుంది. ఇక 2013 లో విడుదల అయిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమా టైమ్ లో ఈ నటి ఏ స్థాయిలో అందాలతో ఆకట్టుకుందో ఇప్పటికీ అదే రేంజ్ లో ఈ బ్యూటీ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: