మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. గ్రేట్ డైరెక్టర్ శంకర్ మూవీ కి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా కనిపించనుండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా నిన్న ఈ మూవీ యూనిట్ సభ్యులు ఈ సినిమా నుండి రెండవ సింగిల్ అయినటువంటి రా మచ్చా మచ్చా అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసారు. ఇకపోతే ఈ సాంగ్ కి విడుదల అయిన నిమిషాల్లోనే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మొదలు అయింది. దానితో ఈ సాంగ్ అదిరిపోయే రేంజ్ రేర్ రికార్డును సృష్టించింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని రా మచ్చా మచ్చా సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 16.44 మిలియన్ న్యూస్ ను సాధించి ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో విడుదల ఆయన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన లిరికల్ సాంగ్స్ లిస్టులో టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. రా మచ్చా మచ్చా సాంగ్ కి 24 గంటలు పూర్తి అయ్యే సరికి 299 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: