ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా.. వర్మ పాపులారిటీ మాత్రం రోజురోజుకు పెరిగిపోతుందే తప్పించి తగ్గడం లేదు. ఆయన సినిమాలు తీయకపోయినా సరే అదే స్టార్‌డమ్ కంటిన్యూ అవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు. యువతలో ఆర్జీవీకి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు.. మొన్నామధ్య ప్రభాస్ - నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీలో వర్మ స్క్రీన్‌పై కనిపించగానే థియటర్లు దద్ధరిల్లిపోయాయి.ఇదిలావుండగా కొద్దిరోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్, వర్జినిటీ లాంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన వర్జినిటీని కోల్పోయానని వ్యాఖ్యానించారు. బెడ్‌పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా కష్టమని వర్మ అన్నారు. ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు తనతో చెప్పలేదని ఆర్జీవీ బోల్డ్ కామెంట్ చేశారు. డేట్‌కు వెళ్లడం తనకు నచ్చదని, ఏదైనా ఇంట్లోనే అని చెప్పాడు.ఈ నేపథ్యంలో అమ్మాయిలేనా ఆంటీలను కూడా ఇష్టపడతారా అని యాంకర్ అడగ్గా.. ఇద్దరూనంటూ వర్మ బోల్డ్ కామెంట్ చేశారు. అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారనే ప్రశ్నకు.. ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందన్నారు. అయితే అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారని , అదే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలావుండగా తాజాగా మరో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో చూడటమో లేక ఎవరో ఒకరు చెప్పడం వల్ల మహిళల గురించి కొన్ని అపోహలు, అభిప్రాయాలు ఏర్పడతాయన్నారు. పురుషుడు శృంగారానికి ముందు మహిళతో మాట్లాడితే.. అమ్మాయిలు మాత్రం కార్యం ముగిసిన తర్వాత మాట్లాడతారని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిని కన్విన్స్ చేయడానికే మగాడు ప్రయత్నిస్తాడని కుండబద్ధలు కొట్టారు.కానీ మహిళలు శృంగారం తర్వాత అతనితో ఎమోషనల్‌గా కనెక్టయి అప్పుడే మాట్లాడుతుందని వర్మ చెప్పారు. కానీ పురుషుడు మాత్రం ఎప్పుడైతే తన శారీరక వాంఛ తీరిందో ఇక ఆమెతో సంబంధం లేదన్నట్లుగా పక్కకి తిరిగి పడుకుంటాడని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. అప్పుడు ఆమె దృష్టిలో పురుషుడు చులకనగా మారిపోతాడని, తనను వాడుకోవడానికే ఇప్పటి వరకు ఇలాంటి మాటలు మాట్లాడా అని భావిస్తుందని వర్మ చెప్పాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.