తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు అనేక మంది ఉన్నారు. దానితో విరు నటించిన సినిమాలో కూడా అప్పుడప్పుడు ఒకే నెలలో పెద్ద ఎత్తున విడుదల అవుతూ ఉంటాయి . ఈ మధ్య కాలంలో కూడా వరుస పెట్టి మెగా హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ తేదీన విడుదల కానున్నాయి లాంటి వివరాలను తెలుసుకుందాం.

మెగా ఫ్యామిలీలో ఒకరు అయినటువంటి వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని నవంబర్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. డిసెంబర్ 25 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: