యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చివరి ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. టెంపర్ నుంచి దేవర వరకు వరుసగా తారక్ నటించిన ఏడు సినిమాలు మిగిల్చిన లాభాల లెక్క 300 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తంలో సగం కంటే ఎక్కువ మొత్తం ఆర్.ఆర్.ఆర్ లాభాలు కాగా తారక్ నటించిన మిగిలిన 6 సినిమాల లాభాల లెక్క 140 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల శాటిలైట్, డిజిటల్, హిందీ రైట్స్, ఆడియో రైట్స్ ఒకింత భారీ మొత్తానికి అమ్ముడవుతాయి. ఈ విధంగా తారక్ సినిమాలు నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తున్నాయి. దిల్ రాజుతో పాటు మరి కొందరు నిర్మాతలు తారక్ తో సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈరోజు దసరా పండుగ కావడంతో పాటు మహాలయ అమవాస్య కావడంతో దేవర కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
 
దేవర మూవీకి టికెట్ల్ రేట్లు ఇప్పటికే కొన్ని జిల్లాలలో తగ్గించగా అన్ని ప్రాంతాలలో టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. ఏపీలో సోమవారం నుంచి టికెట్ రేట్లు తగ్గనున్నాయి. దసరా సెలవులను దేవర మూవీ ఏ రేంజ్ లో క్యాష్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈరోజు సాధించే కలెక్షన్లతో దేవర మూవీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
 
ఈరోజు నుంచి దసరా సెలవులు మొదలతుండటం దేవరకు ప్లస్ కానుంది. టార్గెట్ మరీ భారీ టార్గెట్ కాకపోవడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా మంచి లాభాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఫ్లాప్ డైరెక్టర్లకు తారక్ వరం అయ్యాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ టాలెంట్ ను సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: