విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా అంటూ సాగే సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 17.42 మిలియన్ వ్యూస్ దక్కాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీలోని రెండవ సాంగ్ అయినటువంటి "రా మచ్చా" అంటూ సాగే సాంగ్ ను తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 16.44 మిలియన్ వ్యూస్ దక్కాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 16.38 మిలియన్ వ్యూస్ దక్కాయి.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మూవీ లోని చట్టమల్లే అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 15.68 మిలియన్ వ్యూస్ దక్కాయి.

మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో 14.78 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ మూవీ లో కీర్తి సురేష్ , మహేష్ కి జోడీ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: