కానీ ఇప్పుడు మాత్రం ఆమె పూర్తి స్టైలిష్ గా మారిపోయింది. అందుకే నేడు సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ పట్టేసింది. బాలీవుడ్ స్టార్ల సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. అలాగే సోషల్ మీడియా సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. కొత్త ఫోటోలతో ట్రెండీ డ్యూటీ గా కనిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ ఫ్యాషన్ డ్రెస్సెస్ లో దిగిన ఫోటోలు ఇన్స్టా వేదికగా పంచుకుంది. జర్నీలో ఉన్నట్లుగా కనిపించింది. క్యాబిన్లో కూర్చొని చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సైతం ఇచ్చింది. ఇందులో ఈ అందాల భామ ఎప్పుడు చేసేలాగా తన చిలిపి చేష్టలతో మరింత ఆకట్టుకుంది. రెండు చేతుల వేళ్లతో లవ్ సింబల్ మేక్ చేసింది. ముఖంతో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది.
పెదాలకు లిప్ స్టిక్ వేసుకుంది కానీ మిగతా ముఖానికి ఎలాంటి మ్యాకప్ వేసుకోలేదు. నేచురల్ గానే ఈ ముద్దుగుమ్మ మస్తు అందంగా కనిపించింది. పాల నురుగుల సౌందర్యంతో అందరినీ ఆకట్టుకుంది అయితే ఈ పిక్స్ చూసినవారు స్టైల్ గా కనిపించడంలో అల్లు అర్జున్ కి రష్మిక మందన్న గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. అల్లు అర్జున్ బ్లాక్ కలర్ టీషర్ట్స్ ధరించే స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంటాడు. అయితే అలాంటి లుక్ లో అల్లు అర్జున్ రష్మిక పోటీ వస్తోందని, ఈమె కూడా అల్లు అర్జున్ లాగా చాలా స్టైలిష్ గా కనిపిస్తుందని అంటున్నారు. ఆ ఫోటోలో మీరు చూస్తే ఆమె బన్నీ తో సమానంగా స్టైలిష్ గా తయారయ్యిందని ఒప్పుకోకుండా ఉండలేరు.ఇకపోతే రష్మిక డిసెంబర్ లో పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి మరోసారి రాబోతోంది.