జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర సినిమాకు అడుగడుగునా చిక్కులు వస్తున్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల అలసత్వం వల్ల రద్దు అయిన సంగతి తెలిసిందే. దాని ద్వారా నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లింది. అయినప్పటికీ ఓర్చుకున్న దేవర చిత్ర బృందం... సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ఇప్పటికే 400 కోట్ల క్లబ్లో చేరినట్లు సమాచారం అందుతుంది.


సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అయిన దేవర సినిమా... మొదటిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మళ్లీ పికప్ అందుకుంది. సాయంత్రం వరకు జనాలు.. ఎగబడి మరి థియేటర్ కు వెళ్లారు. అయితే కలెక్షన్లు దూసుకు వెళ్తున్న నేపథ్యంలో... ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాలని... చిత్ర బృందం నిర్ణయం తీసుకుందట. అది కూడా ఏపీలో నిర్వహించాలని అనుకుంటున్నారట.

విజయవాడ అలాగే గుంటూరు మధ్యలో ఉన్న..  అమరావతి ప్రాంతంలో దేవర సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాలని భారీ ప్లాన్ చేస్తున్నారట. మరో రెండు రోజుల్లో ఈ సినిమా సక్సెస్ మీట్ ఫంక్షన్ను నిర్వహించాలని అనుకుంటున్నారట. దీనికోసం ఇప్పటికే చంద్రబాబు సర్కార్ను పర్మిషన్ అడిగిందట చిత్ర బృందం. అయితే... ఈ మీటింగ్ కు చంద్రబాబు పర్మిషన్ ఇవ్వలేదని సమాచారం.

 ప్రస్తుతం విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో పోలీస్ సిబ్బంది మొత్తం అక్కడే ఉంది.  అందుకే దేవర సక్సెస్ మీట్ కు పర్మిషన్ ఇవ్వడం లేదట చంద్రబాబు సర్కారు. ఇప్పుడు అలాంటి మీటింగ్లు పెట్టుకుంటే... అల్లర్లు జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారట.అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు షాక్ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట.  తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఎన్టీఆర్ పై కూట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: