తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత... ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైన నేపథ్యంలో... కల్వకుంట్ల కవిత బయటికి రావడం లేదు. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అంటే మొదటగా కల్వకుంట్ల కవిత అందరికీ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆడేందుకు ముందుకు రావడం లేదు.


ఇవాల్టి నుంచి చిన్న బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుంది. తొమ్మిది రోజులపాటు ఈ మహోత్సవం జరగనుంది అయితే ప్రతిసారి చిన్న బతుకమ్మ రోజున... తెలంగాణ బతుకమ్మకు సంబంధించిన ఏదో ఒక పాటను కల్వకుంట్ల కవిత రిలీజ్ చేసేది. కానీ ఈసారి బతుకమ్మ పైన ఎలాంటి హడావిడి చేయడం లేదు కల్వకుంట్ల కవిత.  ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన కల్వకుంట్ల కవిత... కెసిఆర్ ను కలిసిన తర్వాత.. మళ్లీ బయట ఎక్కడ కనిపించలేదు.


అయితే ఫామ్ హౌస్ లో కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసిన తర్వాత... ఆయన సూచన మేరకు కవిత సైలెంట్ గా ఉన్నారని సమాచారం. కొన్ని రోజులపాటు మౌనంగా ఉండాలని కవితకు చెప్పారని చెబుతున్నారు. అంతే కాదు మంగళవారం కల్వకుంట్ల కవితకు... కాస్త అనారోగ్యం సంభవించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కల్వకుంట్ల కవిత వెళ్లిన సంగతి తెలిసిందే.


అయితే అనారోగ్యం కారణంగా బతుకమ్మకు దూరమ య్యారా? లేక వేరే ఇతర కారణాల వల్ల బతుకమ్మకు దూరంగా ఉంటున్నారా అని కల్వకుంట్ల కవితపై.. కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అది సంవత్స రాల పాటు తెలంగాణ ప్రభుత్వ నిధులతో చాలా గ్రాండ్ గా బతుకమ్మ పండుగ నిర్వహించారు కల్వకుంట్ల కవిత. కానీ ఇప్పుడు ఆమె హడావిడి లేకపోవడంతో...  రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ జోష్ ఎక్కడ కనిపించడం లేదని గులాబీ నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: