చిత్ర పరిశ్రమలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అలా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకొని ఇండస్ట్రీలో చక్రం తిప్పిన నటీమణుల్లో మహేష్ భార్య నమ్రత కూడా ఒకరు. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన 1993లో మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆరో స్థానంలో నిలిచింది. ఇక న‌మ్ర‌త‌ 1977లో శత్రుఘ్న సిన్హా డైరెక్షన్ లో వచ్చిన  'షిర్డీ కే సాయి బాబా'లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలిసారి కెమెరా ముందు నటించింది. ఇక తర్వాత 1986లో రిలీజ్ అయిన  'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' సినిమాలో హీరోయిన్గా తొలిసారిగా నటించింది కానీ పెద్దగా ఆడలేదు.


అదే ఏడాది 'మేరే దో అన్మోల్ రత్న' సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా హిందుస్తానీ, కచ్చే ధాగే, ఆఘాజ్, అస్తిత్వ, అల్బేలా, తేరా మేరా సాత్ రహే అలా ఆమె నటించిన 16 సినిమాలు కమర్షియల్‌గా ఫేయిల్ అయ్యాయి. న‌మ్రతా  బాలీవుడ్‌లో 6 ఏళ్ల కెరీర్‌లో 16కు పైగా ఫ్లాప్ సినిమాలో న‌టించింది. దాంతో  సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది, కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక సినిమాల్లో నటిస్తుండగానే...  సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు కలిసి వంశీ సినిమాలో నటించారు.


సినిమా షూటింగ్ టైమ్‌లో వీరి మ‌ద్య‌ ప్రేమ పుట్టుంది. కాగా 5 ఏళ్ల రిలేషన్ తర్వాత.. 2005లో  వీళ్ల పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార. గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి రోల్ చేశాడు. ఇక కూతురు సితార సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక వీళ్లిద్దరి ఆస్తులు కలిపితే అక్షరాల రూ.400 కోట్లకు పైనే ఉంటుంది  అలా 16కు డిజాస్టర్లు వ‌చ్చిన న‌మ్ర‌త లైప్‌లో  మ‌త్రం ఎంతో స‌క్క‌స్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: