ఒక హీరో మిస్ చేసుకున్న కథతో మరొక హీరో సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక హీరోతో అనుకున్న సినిమా కథను ఆ హీరోతో చెప్పకుండానే వేరే హీరోతో చేసిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటి సందర్భం ఒకటి ఎన్టీఆర్ కెరియర్ లో జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మగధీర అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని అప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే రాజమౌళి ఈ కథతో మొదట ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నాడట. కాకపోతే ఈ సినిమాకు బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అనే కారణంతో ఈ సినిమా ఎన్టీఆర్ పై కరెక్టు కాదు అని ఆ స్టోరీని పక్కన పెట్టేసాడట. ఇక చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు మగధీర కథ అయితే బాగుంటుంది అని అభిప్రాయానికి వచ్చాడట.

కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని తెలిసిన కూడా రిస్క్ చేయాలి అనే ఒపీనియన్ తో చరణ్ తో మగధీర మూవీ ని రూపొందించాడట. ఇలా ఈ మూవీ నీ రాజమౌళి , ఎన్టీఆర్ తో కాకుండా చరణ్ తో రిస్క్ చేసి రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ మాత్రం అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. చరణ్ కు ఈ సినిమా ద్వారా సూపర్ సాలిడ్ వచ్చింది. మగధీర మూవీ.కి రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: