సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా హిట్ కాంబినేషన్లకు మంచి క్రేజ్ ఉంటూ ఉంటుంది. హిట్ కాంబినేషన్ తర్వాత హిట్లలో ఉన్న హీరో , దర్శకులు చేసే సినిమాలపై మంచి బజ్ ఉంటుంది. ఒక బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత హీరో నటిస్తున్న సినిమాలకు , అలాగే ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత దర్శకుడు చేస్తున్న సినిమాలకు మంచి క్రేజ్ ఉంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఓ సినిమా మాత్రం అందరూ ప్లాపులో ఉన్న వారితో రూపొందుతుంది ఆ సినిమానే విశ్వం. ఈ సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తూ ఉండగా కావ్య దాపర్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న గోపీచంద్ గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. అలాగే ఈ మూవీలో హీరోయిన్గా నటించిన కావ్య దాపర్ కి కూడా ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ విజయం కూడా లేదు. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న శ్రీను వైట్ల కూడా ఈ మధ్య కాలంలో అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు.

అలాగే ఈ మూవీ ని నిర్మించిన విశ్వ ప్రసాద్ కి కూడా చాలా అపజేలు ఉన్నాయి. ఆఖరుగా ఈయన మిస్టర్ బచ్చన్ సినిమాను నిర్మించగా ఆ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఇంత మంది ఫ్లాప్ లలో ఉన్న వీరంతా కలిసి చేసిన విశ్వం సినిమా అక్టోబర్ 11 వ తేదీన విడుదల కానుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ విజయం సాధిస్తే వీరందరికీ మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: