ఆరేళ్ల తర్వాత సోలోగా గ్లోబల్ స్టార్ స్టార్గా అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర.. ఈ చిత్రాన్ని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకెక్కించారు. మొదటి బాగా గత నెల 27న  దేవర సినిమా విడుదలై  కాస్త మిక్స్డ్ టాక్ అయితే సంపాదించుకుంది. దీంతో కలెక్షన్స్ సునామీ కూడా సృష్టించింది. ఇందులో ఎన్టీఆర్ నటన అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నది. మొదటిరోజు ఉన్నంత ప్రస్తుతం హైప్ ప్రస్తుతం లేదనే  వార్తలు వినిపిస్తున్నాయి.ఆదివారం వరకు కలెక్షన్స్ బాగానే ఉన్నా సోమవారం నుంచి కాస్త తగ్గినట్టుగా అనిపిస్తోందట.


అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి కావడం చేత అలాగే దసరా సెలవులు కూడా ఉండడంతో ఈ సినిమాకి బాగానే కలిసి వస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. దీంతో కలెక్షన్స్ పేరిగే అవకాశం కూడా ఉంటుంది.. అయితే దేవర సినిమా సక్సెస్ మిట్ ను చిత్ర బృందం ఈసారి భారీగానే ప్లాన్ చేశారు..ఎందుకంటే దేవర సినిమా రిలీజ్ కి ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేసి క్యాన్సిల్ చేశారు. ఈసారి సక్సెస్మెంట్ ని భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇలాంటి సమయంలో చిత్ర బృందం కూడా రెడీ అవుతున్న తరుణంలో ఈ వారంలో సక్సెస్ మెంట్ దేవర ఉండే అవకాశాలు ఉన్నాయనే విధంగా వార్తలు వినిపించాయి.కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే విషయం వైరల్ గా మారుతున్నది. అయితే సక్సెస్ మీట్ కి ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం దసరా నవరాత్రులు ఉండడం చేత ఇలాంటి సమయంలో భద్రత సిబ్బంది ఎక్కువగా దేవాలయాల దగ్గర ఉండడంతో ఈ సక్సెస్ మీట్ దగ్గర భద్రత సిబ్బందిని ఇవ్వలేమని చెప్పారట.. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ మాత్రం వీటన్నిటిని లెక్క చేయకుండా అభిమానుల కోసం రిస్కు తీసుకొని మరి సక్సెస్ మీట్ ఈవెంట్ ని ఆంధ్ర ప్రదేశ్ లో చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: