ప్రస్తుతం వస్తున్న సినిమాలు రేంజ్ మారిపోతుంది. హీరోలు కూడా భారీ కలెక్షన్లు మోజులో పడి భారీ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా మన భారతీయ బాక్సాఫీస్ వద్ద సినిమా విడుదలై మొదటి రోజే రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఇక అలా ముందుగా వారిలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. బాహుబలి 2. సాహు అదిపురుష్‌, స‌లార్, కల్కి సినిమాలతో ప్రభాస్ ప‌స్ట్‌  ప్లేస్ లో ఉన్నాడు.

ఇక తర్వాత స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు .. ఆయన నటించిన త్రిబుల్ ఆర్ దేవర సినిమాలు కూడా ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు అందుకున్నాయి. ఇక వీరి తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో, ది గోట్ సినిమాలు కూడా ఫస్ట్ డేనే రూ.100 కోట్లకు పైగా  కలెక్షన్లు రాబట్టాయి. ఇక వీరి తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ , జవాన్ సినిమాలు కూడా తొలి రోజే రూ .100 కోట్లు అందుకున్నాయి.

ఇక అదే విధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఇక  కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషన్న్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో యాష్ కే జి ఎఫ్ 2 సినిమాతో తొలి రోజే రూ. 100 కోట్లు క్రియేట్ చేసిన హీరోగా మారాడు . అలాగే మరో బాలీవుడ్ హీరో రణ‌బీర్‌ కపూర్ కూడా య‌నిమల్ సినిమాతో తొలి రోజు రూ.100 కోట్లు సాధించిన హీరోల లిస్టులో ఉన్నాడు.  ఇలా ఈ ఏడుగురు హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో తొలిరోజే రూ. 100 కోట్ల కలెక్షన్ అందుకున్న హీరోలగా ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: