ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వనిత విజయ్ కుమార్ నాలుగో పెళ్లి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ పెళ్లి అంటూ నాలుగో సారి కూడా పెళ్లికి రెడీ అయిపోయింది.కానీ పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉండగా ఈ టైంలో ఈమె నాలుగో పెళ్లి ఏంటో అని ఈ విషయం తెలిసిన వాళ్ళైతే చెవుల కొరక్కుంటున్నారు. ఆకాష్, ఆనంద్, పీటర్ పాల్ తాజాగా రాబర్ట్.. ఈ నలుగురి కంటే ముందే వనిత విజయ్ కుమార్ ఓ స్టార్ హీరోకు భార్య కావాల్సిందట.కానీ ఆ అవకాశాన్ని వనిత విజయ్ కుమార్ మిస్ చేసుకున్నట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ వనిత విజయ్ కుమార్ ఏ హీరోకి భార్య అయ్యేదో ఇప్పుడు చూద్దాం. విజయ్ కుమార్ మంజుల ఇండస్ట్రీలో పేరున్న నటీనటులు..వీరిద్దరికీ ముగ్గురు సంతానం ముగ్గురు ఇండస్ట్రీకి హీరోయిన్లు గానే పరిచయమయ్యారు. ఈ ముగ్గురిలో పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ మాత్రం కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్.. వనిత తల్లి చనిపోయాక ఆస్తి విషయంలో తండ్రితో చెల్లెళ్లతో గొడవలు అయ్యాయి.కానీ వనితకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు తండ్రి అలాగే చెల్లెళ్లు.

అంతేకాదు ఆమెను పూర్తిగా దూరం పెట్టేశారు. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. సీరియల్స్ లో చేస్తూ డబ్బు సంపాదిస్తుంది వనిత విజయ్ కుమార్. అయితే అలాంటి హీరోయిన్ కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తో కలిసి తమిళంలో చంద్రలేఖ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో వనితకి ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే చంద్రలేఖ సినిమా చేసే సమయంలో విజయ్ దళపతిని ఎంతగానో ఇష్టపడిందట వనిత. కానీ ఆయన మాత్రం నటి సంఘవితో ప్రేమలో ఉన్నారు..

ఇక సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు విజయ్ ని ప్రేమించే విషయం చెప్పాలని, విజయ్ ని పెళ్లి చేసుకోవాలని ఇలా ఎన్నో కలలు కనేదట. అంతేకాదు విజయ్ ని పెళ్లి చేసుకున్నాక పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారు అని కూడా కలలు కనేదట.కానీ సడన్గా సంఘవితో విజయ్ దళపతికి ఉన్న రిలేషన్ బయటపడి వనిత హార్ట్ బ్రేక్ అయ్యిందట. ఆ తర్వాత బ్యాడ్ లక్ అనుకున్న  వనిత విజయ్ కుమార్ చాలా బాధపడిందట.అలా ఆ సినిమా సమయంలో వనిత విజయ్ కుమార్ ప్రేమని విజయ్ కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే వనిత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్యగా సెటిల్ అయ్యేది అని ఈ విషయం తెలిసిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: