కొన్ని సంవత్సరా ల క్రితం వరకు మన తెలుగు హీరో లు నటించిన సినిమాలు కేవలం తెలుగు భాష లో మాత్రమే విడుదల అవుతూ ఉండేవి . దానితో తెలుగు హీరోల మార్కెట్ చాలా చిన్నగా ఉండేది . 100 కోట్ల కలెక్షన్స్ వస్తే అవి పెద్ద కలెక్షన్స్ గా ఇండస్ట్రీ వారు భావించేవారు . ఇక పరిస్థితులు ప్రస్తుతం పూర్తిగా మారాయి . మన తెలుగు సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు . వందల కోట్ల కలెక్షన్లు కేవలం ఒక్క రోజులోనే తెలుగు మూవీలకు వచ్చేస్తున్నాయి.

ఇది వరకు తెలుగు స్టార్ హీరోలు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమైన సినిమాలు చేస్తూ రావడంతో కొంత మంది దర్శకులు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారితో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చేవారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో చాలా మంది పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును తెచ్చుకున్నారు. దానితో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారు కొంత మంది కి కష్ట కాలం ఎదురవుతుంది. ఎందుకు అంటే కొంత మంది దర్శకులు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

కానీ ఇండియా వైడ్ గా అంత క్రేజ్ లేదు. దానితో వారు ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలి అంటే కచ్చితంగా చాలా డెప్త్ ఉన్న స్టోరీతో సినిమా చేయవలసి ఉంటుంది. దానితో వారికి కాస్త కష్టాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మరి కేవలం స్టార్ హీరోలతో సినిమాలు చేయాలి అనుకునే దర్శకులకు మాత్రమే ఈ కష్టాలు ఉన్నాయి. ఎవరితో అయినా పర్లేదు సినిమా చేస్తాం అనుకున్నవారికి ఇలాంటి కష్టాలు పెద్దగా ఎదురయ్యే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: