- ఐదు రోజుల‌కు నైజాం లో దేవ‌ర షేర్ రు. 37. 75 కోట్లు
- దేవ‌ర నైజాం రైట్స్ రు. 42 కోట్ల‌కు కొన్న దిల్ రాజు
- తొలి రోజే ఏకంగా రు. 22 కోట్ల షేర్ లాగేసిన తార‌క్ .. !
- అల వైకుంఠ‌పురంలో రు. 42 కోట్ల షేర్ రికార్డు బ్రేక్ .. !


- ( టాలీవుడ్ -  - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ .. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా దేవర. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన దేవ‌ర బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తోంది. ఈ సినిమా కు తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా రు. 172 కోట్ల గ్రాస్ వ‌సూల్లు వ‌చ్చాయి. ఇక మూడు రోజుల‌కు ఏకంగా రు. 304 కోట్లు వ‌చ్చాయి. మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా దేవ‌ర జోరు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలోగా బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా గా దేవ‌ర నిలిచింది.


ఇక దేవ‌ర వీకెండ్ లో కాకుండా.. వీక్ డేస్ లోనూ స్ట‌డీగా ముందుకు వెళుతోంది. ఇక దేవ‌ర నై జాం లో 5 వ రోజు కూడా సాలిడ్ నంబర్స్ నమోదు చేసింది. నైజాం ఏరియా వ‌ర‌కు దేవర డే 5 కి నైజాంలో 2.37 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ఓవ‌రాల్ గా చూస్తే ఈ 5 రోజుల్లో 37.75 కోట్ల షేర్ అది కూడా జిఎస్టి కాకుండా వసూలు చేసి రు. 40 కోట్ల దిశ‌గా దూసుకు పోతోంది. నైజాంలో ఎన్టీఆర్ ను బావ అని పిలిచే స్టార్ హీరో అల్లు అర్జున్ అల వైకుంఠ‌పురంలో లాంగ్ ర‌న్ లో రు. 42 కోట్లు రాబ‌ట్టింది. ఇప్పుడు దేవ‌ర మ‌రో 3 - 4 రోజుల్లో ఈ రు. 42 కోట్లు క్రాస్ చేయ‌నుంది. అలా దేవ‌ర బ‌న్నీ రికార్డుకు చెద‌లు ప‌ట్టించేయ నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: