గత కొంతకాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న వరుణ్ తేజ్ మార్కెట్ ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు అని అంటున్నారు. గత రెండేళ్లలో అతడు నటించిన ‘గని’ ‘గాంఢీవధారీ అర్జున’ ‘ఆపరేషన్ వేలంటైన్’ మూవీలు వరసగా ఫ్లాప్ అవ్వడంతో అతడితో సినిమాలు చేయడానికి దర్శకులు ఆలోచనలో పడ్డారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.



ఇలాంటి పరిస్థితుల మధ్య అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘మట్కా’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. 1970-80 ప్రాంతాలలో మట్కా జూదం అలవాటుతో అనేకమంది ఆరోజులలోనే కోట్ల విలువైన ఆస్తులను పోగొట్టుకున్నారు. ఆ సంఘటనలను ఆధారంగా తీసుకుని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘హాయ్ నాన్న’ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



వరుణ్ తేజ్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా నిర్మాణం జరపుకుంటున్న ఈమూవీని నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు ఈమూవీ నిర్మాతలు ఇచ్చిన ప్రకటన షాకింగ్ గా మారింది. దీనికి కారణం నవంబర్ 14న సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’ విడుదల కాబోతోంది’ తమిళ ఫిలిమ్ ఇండస్ట్రీ ‘బాహుబలి’ గా గుర్తింపు పొందిన ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.



వాస్తవానికి ఈసినిమాను రాబోతున్న దసరా కు విడుదల చేయాలని భావించారు. అయితే అదే డేట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈమూవీని నవంబర్ 15కు వాయిదా వేశారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ‘కంగువ’ తో వరుణ్ తేజ్ ‘మట్కా’ ఏధైర్యంతో పోటీ పడుతోంది అంటూ ఇండస్ట్రీలో కొందరు ఆశ్చర్య పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ కెరియర్ కు అత్యంత కీలకం అయిన ఈమూవీని చివరి నిముషం వరకు సూర్యా తో పోటీలో నిలబడి విజయం సాధించగలిగితే అది అతడి కెరియర్ లో ఊహించని ఘనవిజయం అనుకోవాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: