ఆ తర్వాత జయం రవి ఓ స్టార్ సింగర్ తో రిలేషన్లో ఉన్నాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. తనపై వచ్చిన వార్తల్లో నిజం లేదని అలాగే విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని.. తన ఇంట్లో ఉన్న వస్తువులను తనకు తిరిగి ఇప్పించాలంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు జయం రవి . ఇలా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా ఈ వార్ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనపై వస్తున్న అసత్య వార్తలపై గట్టిగానే రియాక్ట్ అయింది జయం రవి భార్య ఆర్తి.
జయం రవి ఆస్తులు మొత్తం ఆర్తి చేతుల్లోనే ఉన్నాయని.. తన భర్తను ఇంటి నుంచి గెంటేసిందని.. దీంతో తన వస్తువులను తిరిగి ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడని ఓ న్యూస్ ఆర్తికి వ్యతిరేకంగా నెట్టింట వైరలయ్యింది. ఈ క్రమంలోనే తన భార్య ఆర్తిపై జయం రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడనే టాక్ కూడా నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై నెట్టింట ఓ నోట్ షేర్ చేసింది ఆర్తి. ప్రస్తుతం తాను మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదని.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లపై మండిపడింది.