దేవర సూపర్ హిట్ తో పాటు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. కల్కి సినిమా తర్వాత ఈ రేంజ్ హిట్ సినిమా పెద్ద సినిమా లేదు. దేవరతో మరోసారి థియేటర్లో కలకల్లాటడంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవటంతో ఫాన్స్ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు . ఇక ఇప్పుడు అభిమానులకు మళ్లీ జోష్‌ని ఇచ్చేందుకు చిత్ర యూనిట్ భారీ స్థాయి లో సక్సెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది.
ఎన్టీఆర్ కూడా అమెరికా టూర్ ముగించుకుని వచ్చేసాడు . ఇప్పటికి అయితే దేవర సక్సెస్ ఈ వెంట్ ను మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉండే గ్రౌండ్స్ లో నిర్వహించాలనే ఆలోచన ఉంది ఇదే గనుక నిజమైతే అభిమానుల తాకిడికి పల్నాడు మారుమోగటం ఖాయం . ఏపీలో ఈవెంట్ కు పర్మిషన్ కుదరకపోతే హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో చేయాలనే ప్లాన్ కూడా చేస్తున్నారు .. ఇక త్వరలోనే దీనిపై అధికార ప్రకటన కూడా రానుంది . కాగా ఈవెంట్ కు అమెరికా పర్యటన కారణంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రాలేకపోవచ్చు అని కూడా అంటున్నారు.