పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. ఇక కొన్నాళ్లుగా పవర్ స్టార్ అభిమానులు ఆయన సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అది పోస్ట్ పోన్ అయింది.ఓజి సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు. చెప్పుకొచ్చారు మేకర్స్.ఈ నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ క్షణం తీరిక లేకుండా తన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ... మరోవైపు ప్రతిపక్షాల వల్ల ఏర్పడిన సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. అలాగే మధ్యలో వీలు చూసుకుని సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభించారు. హరిహర వీరమల్లు సెట్స్‌లో ఆయన అడుగు పెట్టారు. పవన్ లైనప్‍లో ఉన్న మూడు చిత్రాల్లో ఈ మూవీనే ముందుగా రిలీజ్ కానుంది. హరి హర వీరమల్లు నుంచి తొలి సాంగ్ సిద్ధమవుతోంది.హరి హర వీరమల్లు షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో జరుగుతోంది. ఇందుకోసం అక్కడ ఓ భారీ సెట్ వేసింది మూవీ టీమ్. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది. సాంగ్ కూడా ఇప్పటికే రెడీ అయిపోయింది. అందుకే దీపావళికి ఈ పాటను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ డిసైడ్ అయిందని టాక్.


ఇదిలావుండగా పవన్ నటిస్తున్న మరో చిత్రం OG. స్టైలిష్ మేకర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.హరిహర వీరమల్లు కంటే కూడా OG కోసమే ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర విడుదలకు ముందు OG సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను రూ. 110 కోట్లు చెప్పారట. దేవర భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో ట్రెండ్ మారిందని గ్రహించిన OG నిర్మాతలు, ఇప్పుడు మారిన థియేటర్ ట్రెండ్ చూసి పవన్ స్టార్ సినిమా రైట్స్ ను రూ. 150 కోట్లు చెబుతున్నారని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు బయ్యర్స్ ఎగబడుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర లో OG విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.ఇదిలావుండగా పవన్ కల్యాణ్ లైనప్‍లో ఓజీ మూవీపై విపరీతమైన హైప్ ఉంది. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఓజీ వస్తుందని అంచాలు రాగా.. హరి హర వీరమల్లునే సిద్ధమవుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ లైనప్‍లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: