ఈ సినిమాలో వినోద్ కన్నా ప్రధాన పాత్రలో నటించారు. సునీల్ దత్ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు లీనా. ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే.. రాజకీయ పార్టీ కుటుంబానికి చెందిన సిద్ధార్థ బందోర్కర్ వివాహం చేసుకుంది. ఆయన తన తండ్రి దయానంద బందోర్కర్ గోవా మొదటి ముఖ్యమంత్రి. అప్పటికీ లీనా వయసు కేవలం 24 సంవత్సరాలే. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కానీ ఆమె వైవాహిక జీవితం సాఫీగా గడవలేదు.
పెళ్లైన 11 నెలలకే భర్త ప్రమాదంలో చనిపోయాడు. ఇక అప్పుడు ఆమె వయసు 25 ఏళ్ళు మాత్రమే. భర్త మరణం తర్వాత మెట్టినింటిని వదిలి మళ్లీ పుట్టింటికి వచ్చేసింది లీనా. ఆ తర్వాత భర్త మృతికి లీనానే కారణం అంటూ అత్తింటి వారు ఆరోపణలు కూడా చేశారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది. 1980లో కిషోర్ కుమార్ తో ప్యార్ అజ్ఞాతవాసి చిత్రంలో నటించింది. ఈ సినిమా సమయంలోనే కిషోర్,లీనా మధ్య ప్రేమ పుట్టింది. అప్పటికే కిషోర్ కు మూడు పెళ్లిళ్లు కావడంతో ఇక వీరిద్దరి పెళ్ళికి లీనా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ కిషోర్ కు నాలుగో భార్యగా మారిపోయింది. కిషోర్ లీనా కంటే 20 ఏళ్లు పెద్దవాడు కావడం గమనార్హం. అంతేకాదు కిషోర్ ని పెళ్లి చేసుకున్నప్పుడు లీనా ఏడు నెలల గర్భవతి.ఇలా బాలీవుడ్ హీరోయిన్ లీనా జీవితంలో ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయ్.