కోలీవుడ్ హీరో  రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వెట్టయన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ డీజే జ్ఞానోవెల్ డైరెక్షన్ వహిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా పైన బాగానే హైప్స్ ఏర్పడ్డాయి. ఇందులో మంజు వారియర్ లుక్స్ ఈ సినిమాకి మరింత ప్లస్గా నిలిచాయి. జైలర్ సినిమా తర్వాత నటిస్తున్న రజినీకాంత్ సినిమా కావడంతో పాటుగా ఇందులో అమితాబచ్చన్ హీరో రానా వంటి వారు నటిస్తూ ఉండడంతో మరింత హైప్స్ పెరిగిపోయాయి.


ఇప్పుడు తాజాగా వెట్టయన్ ట్రైలర్ ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రజనీకాంత్ మరొకసారి ఒక పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. రానా, అమితాబచ్చన్ ,రజనీకాంత్ మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే సంగీతాన్ని అనిరుద్ అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా ఆడపిల్లల భద్రతకు సంబంధించి సినిమా అన్నట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఖైదీ చెయ్ ఖైదీ చెయ్ ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు .. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉందనే విధంగా మాటలతో ట్రైలర్ మొదలవుతుంది.. ఈ సినిమా మొత్తం ఏదో మర్డర్ మిస్టరీగా కనిపిస్తున్నది.. ఇక రజనీకాంత్ మూడే రోజులలో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుందని డైలాగ్ తో ఎంట్రీ ఇస్తారు. మరొకసారి తన స్టెయిలింగ్ వాకింగ్ తో రజనీకాంత్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, దూషారా విజయన్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతానికైతే ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. మరి సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి అంటే 10 వ తేదీ వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: