బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలతో పాటు భోజ్పూరి ఇండస్ట్రీ తో కలిపి 81 సినిమాల్లో నటించింది నగ్మా. తన నటనతో ప్రతి ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాంటి నగ్మా తన సిని కెరీర్ లో వ్యక్తిగత జీవిత విషయానికి సంబంధించి ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే వచ్చింది. ఇక తన సినీ కెరీర్ లో ముగ్గురు పెళ్లి అయిన హీరోలతో ఎఫైర్ పెట్టుకుందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక అదే విధంగా భారత స్టార్ క్రికెటర్ సౌరబ్ గంగోలి తో కూడా ఈమె డేటింగ్ చేసిందని కూడా అంటారు.
అయితే నగ్మా తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. 50 ఏళ్ల వయసులో ఉన్న ఈ గ్లామర్ నటి ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. నగ్మా కేవలం 17 ఏళ్ల వయసులోనే సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కేవలం 16 ఏళ్ల వయసులో నగ్మాకు సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. 1990లో 'బాఘీ: ఎ రెబెల్ ఫర్ లవ్'తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి.
అరంగేట్రం తర్వాత 'ధర్మాత్మ', 'కిల్లర్', 'పూలిస్ ఔర్ ముజ్రిమ్', 'యాల్గర్', 'అశ్వమేధం' వంటి సినిమాల్లో తన నటనతో ప్రజలను ఆకట్టుకుంది. హిందీ సినిమాల్లో పనిచేసిన తర్వాత సౌత్‌లో కూడా ప్రయత్నించింది. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి చర్చకు వచ్చింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీతో నగ్మా ఎఫైర్ గురించి వార్తలు వెలువడ్డాయి. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. అదే టైంకి సౌరవ్ గంగూలీకి అప్పటికే వివాహం జరిగింది. తర్వాత ఈ నటి రవికిషన్‌తో ముడిపడి ఉంది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వచ్చాయి. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు నగ్మా కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. నేడు 49 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం గడుపుతోంది.