తన విడాకుల రూమర్స్ పైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన హీరోయిన్ సమంత ఇలా స్పందిస్తూ.."మహిళలని వస్తువుల చూసేటువంటి ఈ సినీ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడడం నిలబడి పోరాడడం వంటి వాటికీ చాలా శక్తి కావాలి.. తన ప్రయాణాన్ని ఎవరూ కూడా చిన్నచూపు చూడద్దు ఇక విడాకులనేవి పూర్తిగా తన వ్యక్తిగత విషయము అంటూ తమ ఇద్దరి అంగీకారంతోనే జరిగిందని ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదంటే తెలియజేసింది సమంత. దయచేసి ఇక మీదట తన పేరును వాడకండి రాజకీయాలకు దూరం పెట్టండి అంటూ సమంత ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీంతో సమంత అభిమానులు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అటు నాగార్జున కూడా ఈ వ్యాఖ్యల పైన గట్టి కౌంటర్ వేయడమే కాకుండా కేటీఆర్ కుటుంబం కూడా కొండ సురేఖ కామెంట్ల పైన ఫైర్ కావడం జరిగింది. మరి ఈ సమంత వ్యవహారం మొత్తానికైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కానీ సమంత చేసిన ఈ పోస్టు వల్ల ఇకమీదట ఈ విషయాలకు చేకపడుతుందేమో చూడాలి. సమంత నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అలాగే మయోసైటిస్ వ్యాధి వల్ల కూడా చాలా రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి నటిస్తోంది.