టాలీవుడ్ , కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో కూడా ఏకకాలంలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో బ్యూటిఫుల్ నటీమని నయనతార ఒకరు. ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె తెలుగు సినిమాలలో నటించడం కంటే కూడా తమిళ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపించింది. దానితో ఈమె తమిళ్ ఇంట్రెస్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడ అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్ స్థాయి కి చేరుకుంది. ఇప్పటికీ కూడా ఈమె తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

ఈమె కొంత కాలం క్రితం షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో కూడా సూపర్ క్రేజ్ లభించింది. ఇకపోతే జవాన్ మూవీ కంటే ముందే షారుక్ హీరోగా రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నయనతార కు హీరోయిన్గా అవకాశం వస్తే దానిని ఈ బ్యూటీ రిజెక్ట్ చేసిందట. మరి ఆ సినిమా ఏది ..? ఎందుకు రిజెక్ట్ చేసింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం షారుక్ ఖాన్ "ది చెన్నై ఎక్స్ ప్రెస్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది.

మూవీ లో హీరోయిన్ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం నయనతార ను సంప్రదించిందట. ఇక ఈ సినిమా కథ మొత్తం విన్న నయన తార స్టోరీ సూపర్ గా ఉంది అని అందట. కానీ ఆ సమయంలో ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో ది చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఆఫర్ను ఈ ముద్దుగుమ్మ వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జవాన్ మూవీతో మాత్రం ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: