నిన్నటి రోజు నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా వ్యాఖ్యలు చేసింది తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. ముఖ్యంగా కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ నాగచైతన్య, సమంతకు సంబంధించి విడాకుల వ్యవహారంలో కేటీఆర్ హస్తముందు అనే విధంగా వ్యాఖ్యలు చేసింది. దీంతో చాలామంది హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ అలవాటు చేశారనే విధంగా ఆమె ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ కొండా సురేఖ మీద తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.


ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విధంగా    ట్వీట్ చేస్తూ.. ఇతరులు తమ పైన నిరాదాల ఆరోపణలు చేస్తూ ఉంటే ఎవరు కూడా మౌనంగా చూస్తూ కూర్చోలేమని.. జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశారు. సమంత ,నాగచైతన్య విడాకుల పైన కొండా సురేఖ చేసిన ఈ వాక్యాల పైన ఇలా ట్వీట్ చేస్తూ.. అలాగే వారి యొక్క విడాకుల పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వ్యక్తిగత జీవితాలను రాజకీయాలలోకి లాగవద్దు బాధ్యతాపరమైన స్థానంలో ఉన్నారు గౌరవాన్ని, గోప్యతను సైతం పాటించాలి సినీ పరిశ్రమ గురించి ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు చేయడం చాలా బాధాకరంగా ఉందంటూ తెలిపారు. ఇలాంటివి ఫిలిం ఇండస్ట్రీ అసలు సహించదంటూ ఎన్టీఆర్ ట్విట్ చేయడం జరిగింది.


ఇప్పటికే చాలామంది నాగచైతన్య వ్యవహారం పైన స్పందించారు. సమంత కూడా నిన్నటి రోజున ఈ విషయం పైన స్పందించి కొండ సురేఖకు కౌంటర్ వేయడం కూడా జరిగింది. రాజకీయాలద్దీ కోసం తన వాడుకోవద్దని తమ పేరుని అసలు రాజకీయాలలోకి వాడవద్దని.. ఇద్దరి అంగీకారంతోనే విడిపోయాము అన్నట్టుగా తెలియజేసింది సమంత. మరి ఈ విషయం పైన కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో చూడాలి మరి. ఇప్పటికే కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈమె పైన కేసు ఫైల్ చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది అలాగే అక్కినేని ఫ్యాన్స్ కూడా కొండా సురేఖ పైన ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: