గత కొన్నేళ్లుగా విడాకుల వ్యవహారం పైన సైలెంట్ గా ఉన్న నాగచైతన్య నిన్నటి రోజున కొండా సురేఖ మాట్లాడిన మాటలకు విడాకుల వ్యవహారం పైన నాగచైతన్య మాట్లాడారు. తన ట్విట్టర్ నుంచి ఒక పోస్టుని షేర్ చేస్తూ .."జీవితంలో విడాకుల అనే అంశం చాలా బాధాకరమైన విషయాలలో ఒకటి చాలా ఆలోచించే మా పర్సనల్ కారణాలవల్ల తాను తన మాజీ భార్య విడిపోయాం అంటూ తెలిపారు.జీవితంలో ఎవరిదారుల్లో వారు ముందుకు వెళ్లడానికి గౌరవంతోనే మేము విడాకులు తీసుకున్నామని.. గతంలో కూడా మా విడాకుల పైన ఎన్నో ఆరోపణలు వినిపించాయి మా రెండు కుటుంబాల పైన ఉన్న గౌరవంతోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని కానీ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని తెలియజేశారు".
మంత్రి పదవిలో ఉండి ఆమె అలా చేయడం కరెక్ట్ కాదని సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం కూడా ఉండాలని సినీ ప్రముఖుల జీవితాలను కేవలం మీడియా ప్రతినిధులు హెడ్లైన్స్ కోసమే మాత్రమే ఉపయోగించడం ఇది సరైన పద్ధతి కాదు అంటూ నాగచైతన్య ఫైర్ అయ్యారు. అక్కినేని అభిమానులతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం.