పోకిరి మూవీ 2006 సంవత్సరంలో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్ అయింది. మొదట పోకిరి అనే టైటిల్ విని ఇదేం టైటిల్ అని కామెంట్లు చేసిన వాళ్లే సినిమా విడుదలైన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అప్పట్లోనే ఈ సినిమాకు 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమా ఒక విధంగా మహేష్ బాబు ఇమేజ్ ను సైతం మార్చేసిందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. అయితే పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అతిథి, సైనికుడు, ఖలేజా సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ప్రేక్షకులు నిరాశపరిచాయి.
అయితే దూకుడు సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మళ్లీ ఫ్లాపులొచ్చినా మహేష్ బాబు మాత్రం శ్రీమంతుడు, భరత్ అనే నేను మరికొన్ని సినిమాలతో సత్తా చాటారు. మహేష్ బాబు తర్వాత సినిమాలతో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.