ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా అక్కినేని కుటుంబ సభ్యులు, అమల, నాగార్జున ,నాగచైతన్య, సమంత వంటి వారు కూడా ఈ విషయం పైన ఫైర్ అయ్యారు. అలాగే ఇప్పుడు హీరో నాచురల్ స్టార్ నాని కూడా ఈ విషయం పైన ఫైర్ అయ్యారు. నాని మాట్లాడుతూ బాధ్యత గల పదవిలో ఉన్న రాజకీయ నాయకులు అసలు అర్థంలేని మాటలు అనడం చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని హీరో నాని ఫైర్ కావడం జరిగింది. కాస్త కూడా బాధ్యత లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే అసలు మీరు ప్రజల పైన ఎంత బాధ్యతగా ఉన్నారో అనిపిస్తోంది అంటూ తెలియజేశారు. సినీ పరిశ్రమ అంటే రాజకీయ పార్టీ కాదు అని గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటూ తెలియజేశారు నాని.
అలాగే మాజీ మంత్రి వైసిపి మహిళ ఆర్కే రోజా కూడా కొండా సురేఖ పైన ఫైర్ కావడం జరిగింది కొండా సురేఖ టిఆర్ఎస్ పార్టీ అనుమానాలు చేసిన వాక్యాలను సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈ విషయం తనను కూడా తీవ్రమైన ఆవేదనకు గురయ్యేలా చేస్తోంది అంటూ.. తోటి మహిళ పైన ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఆ మనసు ఎలా అంగీకరించింది అంటూ రోజా ప్రశ్నించడం జరిగింది. అందుకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారుతున్నాయి.