గతవారం విడుదలైన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డూ వివాదం పై హీరో కార్తీ మాట్లాడుతూ అది సున్నితమైన విషయం అని అంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో ఈవిషయాన్ని పవన్ సీరియస్ గా తీసుకుని స్పందించిన విషయం తెలిసిందే. ఈవిషయం సీరియస్ గా మారడంతో కార్తీ వెనువెంటనే స్పందించి క్షమార్పణలు చెప్పడంతో అక్కడితో ఆవ్యవహారం సద్దుమణిగింది.
అయితే ఈవిషయం పై తమిళ ప్రజల వరకు వెళ్లడంతో తమిళ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా కొందరు పవన్ ని టార్గెట్ చేసుకుంటూ పలు ట్విట్టర్ హ్యాండిల్స్ యాక్టివ్ చేశారు. ఈవిషయాలు అన్నీ పవన్ దృష్టి వరకు వెళ్ళడంతో వ్యూహాత్మకంగా పవన్ వ్యవహరించినట్లు అర్థం అవుతోంది. పవన్ ఒక తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ భాషలో అనర్గళంగా మాట్లాడుతూ తమిళ సంస్కృతి గురించి ఆయన చేసిన కామెంట్స్ తమిళ మీడియాకు హాట్ టాపిక్ గా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా పవన్ వీలైనంత వరకు సరళంగా తమిళంలోనే సమాధానం చెప్పడంతో ఆ ఇంటర్వ్యూను చూసిన వారు షాక్ అవుతున్నారు.
సనాతన ధర్మం విజయ్ లియో విజయ్ కాంత్ ల ప్రస్తావనతో పాటు అన్నా దురై ఎంజిఆర్ జయలలిత పై ప్రశంసలు కాలీవుడ్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా మధురై మాండలికం ఇలా అనేక విషయాలు ఆ ఇంటర్వ్యూలో పవన్ నోటివెంట విన్నవారు పవన్ కు తమిళ భాష పై ఉన్న పట్టును చూసి ఆశ్చర్యపోతున్నారు..