-బాహుబలి తో రికార్డులు బ్రేక్..
- కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడంటూ జనాల్లో క్యూరియాసిటీ..
ప్రభాస్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరుగాంచిన హీరో.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసలు వీడేం హీరో..వీడి మీద బడ్జెట్ పెట్టి కూడా వేస్ట్..అసలు హీరోగా తీసుకోవడం మన కర్మ అనే స్టేజి నుండి మేము ఈ హీరో తోనే సినిమాలు చేస్తాం అని దర్శకనిర్మాతలు ఎగబడే స్టేజ్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు.ఈయన కెరీర్ ని ఒక్కసారిగా టర్న్ తిప్పేసింది బాహుబలి మూవీ. మన ఇండియన్ హిస్టరీ లోనే మొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఎదిగారు అంటే సినిమాల్లో ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి ప్రభాస్ నీ పాన్ ఇండియా స్టార్ గా చేసిన బాహుబలి మూవీ గురించి కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ సెన్సేషన్ బాహుబలి :
మన ఇండియన్ సినీ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లో రాజమౌళి ఒకరు అనడానికి బాహుబలి సినిమానే కారణం. ఈయన చేసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టరే. సినిమా సినిమాకి మధ్య ఎన్నో అంచనాలు పెంచుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుతున్నారు. అయితే అలాంటి రాజమౌళి దర్శకత్వంలో 2015 జూలై 10న విడుదలైన బాహుబలి మూవీ మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా చూసిన జనాలు థియేటర్ల నుండి ఈలలు, అరుపులతో బయటకు వచ్చారు. దాదాపు 180 కోట్ల బడ్జెట్ పెట్టి బాహుబలి సినిమా తీస్తే బాక్సాఫీస్ వద్ద దాదాపు 600కు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. హీరోగా చేసిన ప్రభాస్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో విలన్ గా రానాని చూపించారు.ఇక బాహుబలి సినిమాలోని శివగామి పాత్ర కూడా చాలా హైలెట్.అనుష్క,తమన్నా లను హీరోయిన్లు గా మరో కీలకమైన కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటించారు. అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక సినిమా క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మొదటి పార్ట్ ని ఎండ్ చేశాడు రాజమౌళి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ చూసిన చాలా మందిలో పార్ట్ -2 చూడాలని ఆత్రుత ఎంతగానో ఉండేది.ఇక క్లైమాక్స్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.