అదే ఆర్య. సాధారణంగా ఒక సినిమాలు హీరో హీరోయిన్ లవ్ చేయమని వెంటపడటం కామన్. కానీ ఈ సినిమాలో మాత్రం లవ్ చేయకపోయినా పర్వాలేదు కనీసం హేట్ చెయ్యి అని హీరో వెంటపడతాడు. అంతేకాదు హీరోయిన్ లవ్ గెలిపించడానికి తన లవ్ ని సైతం సాక్రిఫైజ్ చేస్తాడు. ఇలాంటి కథతో అంతకుముందు ఏ సినిమా రాలేదు. అందుకే ఇక ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది 2004 మే 7వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లోనే 30 కోట్ల వసూళ్లు అందుకుంది.
ఒకరకంగా అల్లు అర్జున్ కెరీర్ ఆర్య సినిమాకి ముందు ఆర్య సినిమా తర్వాత అని చెప్పవచ్చు. అంతకుముందు చేసిన గంగోత్రి సినిమా హిట్ అయినప్పటికీ బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి ఇతను హీరో అయ్యాడు లేదంటే ఇతని మొహానికి ఇతను హీరో ఏంటి అని విమర్శలు వచ్చాయి. కానీ ఆర్య సినిమాతో విమర్శకులను ముయించాడు అల్లు అర్జున్ ఇక ఈ సినిమాతో కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు అటు సుకుమార్ కు కూడా ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. సుకుమార్ కు ఇది మొదటి సినిమా అయితే అల్లు అర్జున్ కు రెండో సినిమా. ఇటీవల ఈ సినిమా 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకోవడంతో అల్లు అర్జున్ ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ గా కూడా స్పందించాడు. తన జీవితాన్ని మార్చేసిన సినిమా ఇదే అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అయితే ఆర్య సినిమాతో ఏ డైరెక్టర్ అయితే అల్లు అర్జున్ కెరీర్ ను మార్చేసాడో.. ఇక పుష్పా సినిమాతో అదే డైరెక్టర్ అల్లు అర్జున్ ని ఐకానిక్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించేలా చేశాడు. ఇలా మొదటి నుంచి సుకుమార్ అల్లు అర్జున్ కెరీర్ మలుపు తిరగడంలో కీలక పాత్ర వహించాడు.