ఏకంగా అక్కినేని ఫ్యామిలీ గురించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఫాన్స్ కి కూడా అస్సలు నచ్చడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమె వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, నాని, నాగార్జున, ప్రకాష్ రాజ్, సమంత, నాగచైతన్య, కుష్బూ సహా మరి కొంత మంది సినీ సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు అటు అక్కినేని ఫ్యామిలీకి ఎంతో సన్నిహితుడుగా ఉండే రాంగోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
నాగార్జున కుటుంబాన్ని అత్యంత హర్రిబుల్ గా అవమానపరిచిన కొండ సురేఖ కామెంట్లకి నేను షాక్ అయ్యాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం భరించలేని విషయం. ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచూరించని విధంగా జుగుప్సాకరమైన నిందలు ఆమె వేశారు. ఆమె ఏదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్టు.. కన్ఫర్మేషన్ తో మీడియా ముందు అరచి చెప్పడం నిజంగా దారుణం. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగచైతన్య నాగార్జున లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ మహానటి మీద ఇంత నీచమైన కామెంట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే కలగజేసుకొని ఇలాంటివి మరోసారి జరగకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరఫు నుంచి అడుగుతున్న అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఆర్జీవి.