•కళ్యాణ్ రామ్ సినీ జీవితాన్నే మార్చేసిన అనిల్ రావిపూడి

•పటాస్ సినిమాతో నటుడిగా గుర్తింపు..

•హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా...



నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా తొలిచూపులోనే  అనే సినిమాతో దివంగత నటులు నందమూరి హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్,  తండ్రి వారసత్వాన్ని పుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ మరో వారసుడైన ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతుంటే తమ్ముడు రేంజ్ లో కళ్యాణ్ రామ్ ఎదగకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. ఇకపోతే హీరోగా కళ్యాణ్ రామ్ చాలా చిత్రాలలో నటించినా.. ఈయన కెరియర్ కు  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించింది మాత్రం ఒక కామిక్ డైరెక్టర్ అని చెప్పాలి. ఆయన ఎవరో కాదు ఎఫ్2 , ఎఫ్ 3 చిత్రాలతో కామిక్ డైరెక్టర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి.

అసలు విషయంలోకి వెళ్తే బాలగోపాలుడు అనే సినిమాతో 1989 లోనే తన బాబాయ్ బాలకృష్ణ నటించిన చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి కెరియర్ మొదలు పెట్టారు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు కానీ ఏ సినిమా కూడా ఈయనకు అంతగా విజయాన్ని అందించలేదు. కానీ 2015లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమా కళ్యాణ్ రామ్ లోని నటుడిని వెలికి తీసిందని చెప్పాలి.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలవడమే కాకుండా కళ్యాణ్ రామ్ ను హీరోగా నిలబెట్టిందని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ పలు చిత్రాలలో హీరోగా నటించారు కానీ అనుకున్నంత స్థాయిలో ఆయన సక్సెస్ అందుకోలేదు. ఇక 2022లో వచ్చిన బింబిసారా సినిమాతో మరొకసారి నిరూపించుకున్నారు కళ్యాణ్ రామ్. ఆ తరువాత అమీగోస్, డెవిల్ చిత్రాలలో అదే జోష్ తో నటించినా.. ఆ చిత్రాలు మాత్రం డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం నిర్మాతగా మారి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన పలు చిత్రాలను నిర్మిస్తున్న ఈయన..  తాజాగా తన తమ్ముడు ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య నిర్మాతగా కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారనటంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: