మన తెలుగు చత్ర పరిశ్రమంలో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇలా మంచి సినిమా వస్తే దివంగత సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు లాంటి లెజెండ్రీ డైరెక్టర్లు అభినందిస్తూ ఉంటారు. చిన్న దర్శకులని, నిర్మాతలని దాసరి గారు అప్పట్లో ఎంతో ప్రోత్సహించేవారు. ఇక కొత్త తరం దర్శకలు వచ్చాక ఆయనకి బాగా నచ్చిన సినిమాలు చాలా తక్కువని దాసరి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో తనకి నచ్చిన సినిమాల్లో బొమ్మరిల్లు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. బొమ్మరిల్లు తర్వాత నాకు ఏ సినిమా నచ్చలేదు కానీ నాగార్జున - కార్తీక్ నటించిన ఊపిరి మూవీ మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కూడా కురిపించారు.

ఇక బొమ్మరిల్లు తర్వాత నాకు నచ్చిన సినిమా కూడా ఇదే అని మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కొత్త తరహా సినిమాలు చేయగలదని నిరూపించడానికి ఊపిరి పోసిన సినిమా ఊపిరి అని దాసరి అప్పట్లో అభినందించారు. బొమ్మరిల్లు తర్వాత నన్ను పూర్తి స్థాయిలో మెప్పించిన చిత్రం లేదు. కానీ ఊపిరి చిత్రంలో ప్రతి అంశం నాకు నచ్చింది. మంచి మేకింగ్, అద్భుతమైన పెర్ఫామెన్స్ లు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడూ తెలుగులో ఇలాంటి సినిమా చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పోస్టర్స్ లో చూసి నాగార్జున ఏంటి కుర్చీలో కూర్చుని ఉన్నాడు.. ఈ సినిమా ఆడదు అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. డ్యాన్సులు, ఫైట్స్ చేసే హీరోని రెండున్నర గంటల పాటు కుర్చీలో సినిమా చేయడం అనేది సాహసం. ఈ చిత్రంలో నటించిన కార్తీ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ కుర్రాడు ఇలాంటి పెర్ఫామెన్స్ కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయినట్లు దాసరి తెలిపారు. ఈ చిత్రం విషయంలో ప్రధానంగా క్రెడిట్ ఇవ్వాల్సింది దర్శకుడు వంశీ పైడిపల్లికి. ప్రతి సన్నివేశంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. తమన్నా చేత ఇలాంటి పాత్రలు కూడా చేయించవచ్చు అని ఎవరూ ఊహించి ఉండరు అంటూ దాసరి ప్రశంసలు కురిపించారు. నాగార్జున కెరీర్ లో ఊపిరి చిత్రం ఒక డిఫెరెంట్ మూవీగా నిలిచిపోతుంది. నాగార్జున ఈ చిత్రంలో కాళ్ళు కోల్పోయిన బిలీనియర్ గా నటించారు. ఈ చిత్రం అనేక ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: