- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .


టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ దేవర ’  . ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సునామీ క్రియేట్ చేస్తూ సెన్షేష‌న‌ల్ రికార్డుల తో దూసుకు పోతోంది. ఆచార్య లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కోలుకున్న  దర్శకుడు కొరటాల శివ చాలా క‌సితో దేవ‌ర సినిమాను తెరకెక్కించారు. కంప్లీట్ మాస్ యాక్షన్ డ్రామా గా తెర‌కెక్కిన దేవ‌ర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింద‌నే చెప్పాలి. తొలి రోజు మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా కూడా చాలా స్లో మూమెంట్ తో దేవ‌ర ప్రేక్ష‌కుల‌కు కిక్ ఇస్తూ దూసుకు పోతోంది. దేవ‌ర రికార్డులు చూసి న నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తుం డ‌డంతో పాటు బాక్సాఫీస్ దగ్గర ఎట్ట‌కేల‌కు త‌మ ఎదురు చూపులు ఫ‌లించాయ‌ని .. త‌మ ఆక‌లి తీరింద‌ని కామెంట్లు పెడుతున్నారు.


ఇదిలా ఉంటే దేవ‌ర సినిమాతో ఎన్టీఆర్ ఓ అదిరిపోయే రేర్ ఫీట్‌ను సాధించాడని అభిమానులు నెట్టింట సంబ‌రాలు చేసుకుంటున్నారు. పదేళ్లుగా తమ హీరో ఒక్క ఫ్లాప్ లేకుండా సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడంటూ వాళ్లంతా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు . 2015లో టెంపర్‌తో ఎన్టీఆర్ విజయయాత్ర మొదలైందని.. ఆ తరువాత వ‌రుస పెట్టి నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ - జై లవ కుశ - అరవింద సమేత - ఆర్ఆర్ఆర్ చిత్రాలతో వరుస విజయాల తో దూసుకు పోతున్నాడు.


ఇక తాజాగా దేవ‌ర సినిమాతో తన విజయయాత్రను తారక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్.రాజమౌళితో సినిమా చేసిన హీరో తన తరువాత చిత్రంతో డిజాస్టర్ కొడ‌తాడ‌న్న బ్యాడ్ సెంటిమెంట్ ను కూడా తార‌క్ ఈ సినిమా తో బ్రేక్ చేసి ప‌డేశాడు. ఇక ఎన్టీఆర్ ఖాతాలో ఇప్ప‌టికే 7 వ‌రుస హిట్లు ఉన్నాయి.. మ‌రో రెండు హిట్లు ప‌డితే టాలీవుడ్ లో ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల‌లో త్రిబుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రేర్ రికార్డ్ కూడా మ‌నోడి ఖాతాలో ప‌డుతుంది.
[1:16 pm, 3/10/2024] V Subhash:

మరింత సమాచారం తెలుసుకోండి: