నాగచైతన్య సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని.. సమంతను తన దగ్గరికి పంపియ్యాలని కేటీఆర్ డిమాండ్ చేయడంతో.. నాగ చైతన్య, నాగార్జున ఇక ఈ విషయంపై సమంతతో ఒత్తిడి తెచ్చారని.. సమంత ఒప్పుకోకపోవడంతో విడాకులు జరిగాయి అంటూ కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఇక ఆమె వ్యాఖ్యలు ఏకంగా ఇండస్ట్రీని ఊపేసాయి అని చెప్పాలి. అయితే కొండా సురేఖ సారీ చెప్పినప్పటికీ అటు ఆమె చేసిన వ్యాఖ్యలపై మాత్రం అటు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమై విమర్శలు గుప్పిస్తూ ఉంది. అయితే ఇదే అంశంపై మెగా కోడలు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాటి స్పందించింది.
కొండ సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఒక మహిళ అయ్యుండి తోటి మహిళను అవమానించడం నిజంగా సిగ్గుచేటు. ఆడవాళ్లు అంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా.. ఎందుకు ఊరికే హీరోయిన్లను టార్గెట్ చేస్తూ ఉంటారు అంటూ లావణ్య త్రిపాఠి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు మంచు లక్ష్మి కూడా ఈ విషయంపై స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల బాధిత మహిళలకు తీవ్ర క్షోభను అనుభవిస్తారు అంటూ మంచు లక్ష్మి అన్నారు. అయితే ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై అటు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వగా.. నాగార్జున కూడా లీగల్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అన్నకు తెలుస్తుంది.