అయితే ఈ సినిమా రెండు పాటలు ఉండడంతో.. ఇప్పటికే మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులందరూ రెండవ పార్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఊహాగానాల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. మొన్నటి వరకు కొడుకుగా ఉన్న ఎన్టీఆర్ పాత్ర.. సెకండ్ పార్ట్ లో తండ్రిని చంపుతాడని ఒక టాక్ వైరల్ గా మారిపోయింది. ఇదే సినిమాలో ట్విస్ట్ గా ఉండబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ కొడుకుగా ఉన్న ఎన్టీఆర్ పాత్ర కాదు ఒక రాక్షసుడు తండ్రి ఎన్టీఆర్ పాత్రను చంపే ట్విస్ట్ ఉంటుందట.
ముందు నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. కానీ మొదటి పార్ట్ లో అతని క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు. దీంతో ఇక రెండవ పార్ట్ తో బాబీ డియోల్ కు సంబంధం ఉంది అని వార్తలు పుట్టుకొస్తున్నాయ్. దేవర చూసిన ప్రేక్షకులు అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ లో దేవరను వర చంపినట్లుగా చూపిస్తారు. అయితే దేవరను చంపాలి అనుకునేది మాత్రం బైరా. కానీ ఆ సీన్లో బైరాను చూపించరు. దీంతో దేవరను ఎవరు చంపారనేదే ట్విస్ట్ ఇలా దేవర పాత్రను చంపేది బాబీ డియోల్ చేసే పాత్ర అని. ఈ పాత్ర రాక్షసుడి కంటే మరింత క్రూరత్వంతో ఉంటుందని ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మరి ఏది నిజం తెలియాలంటే మాత్రం సెకండ్ పార్ట్ విడుదల అయ్యేంతవరకు ఎదురుచూడాల్సి ఉంటుంది.