ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల నాడిని పట్టేస్తున్న యంగ్ హీరోలు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్లను కొట్టేస్తున్నారు. వైవిద్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న హిట్టు కొట్టలేకపోతున్న హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
అక్కినేని నాగచైతన్య : అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీలోకి నాగచైతన్య ఇప్పటివరకు స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఎదగడం కాదు కెరియర్ను నిలబెట్టుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. అయితే వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఈ అక్కినేని హీరో. కానీ ఎప్పుడో ఒకసారి తప్ప సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. ఈయన సినిమాల్లో ఏం మాయ చేసావే, 100% లవ్, మజిలీ లాంటి కొన్ని మాత్రమే అతని కెరియర్లో హిట్ సినిమాలుగా ఉన్నాయి.
తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇతర భాషల్లో మాత్రం పెద్దగా హిట్ కావడం లేదు. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న తండేల్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అయినా సక్సెస్ కొట్టాలని అభిమానులు అనుకుంటున్నారు.
శర్వానంద్ : ఇతను యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో. కానీ ఇది నా హిట్ సినిమా అని చెప్పుకోవడానికి ఇతని కెరియర్ లో ఒక్కొక్కటి కూడా లేదు. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. అయినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. ఇలా ఈ రోజుల్లో కొత్తగా వచ్చిన హీరోలే మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించి పాన్ ఇండియా రేంజ్ హిట్స్ కొడుతుంటే ఈ ఇద్దరు హీరోలు మాత్రం పోలోమని వరుస సినిమాలు చేస్తున్న సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నారు.