అయితే ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇక ఇప్పుడు ఐదో వారం కూడా చివరికి వచ్చింది. అయితే ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉండబోతున్నాయి అన్నది తెలుస్తుంది. ఇక నేడు జరగబోయే ఎపిసోడ్లో ఒకరిని ఆదివారం జరగబోయే ఎపిసోడ్లో మరొకరిని ఎలిమినేట్ చేయబోతున్నారట. అంతే కాదు వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. నైనిక, మణికంఠ, విష్ణు ప్రియ, నభీల్,ఆదిత్య ఓం, నిఖిల్ ఆరుగురు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఇక వీరిలో వరంగల్ పోరడు నవీన్ ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడు.
చివరి రెండు స్థానాలలో ఆదిత్య ఓం నైనిక ఉన్నారట. ఇక ఒక రకంగా వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్పాలి. అయితే వీరిద్దరిలో ఒకరు మిడ్ వీక్ లో మరొకరు వీకెండ్ లో ఎలిమినేట్ అవుతారని హౌస్ నుంచి బయటికి వస్తారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే మంచి గేమ్ ఆడుతున్న ఆదిత్య ఓం ఇక ఈ వారాంతం చివరికల్లా మంచి ఓటింగ్ సంపాదించే అవకాశం ఉంది అని అందరూ అనుకుంటూ ఉండగా.. ఇక ఓటింగ్ పూర్తిగా తారుమారు అయ్యిందట. దీంతో నైనిక హౌస్ నుంచి బయటికి వెళ్లబోతుంది అనుకుంటుంటే ఇక రెండు ఎలిమినేషన్స్ ఉండడంతో ఆదిత్య హోమ్ కూడా బయటికి వస్తాడని ప్రచారం జరుగుతుంది. ఒకటే ఎలిమినేషన్ ఉన్నప్పటికీ కూడా నైనిక కాకుండా ఆదిత్య అందరికంటే చివర్లో ఉన్నాడని అతనే హౌస్ నుంచి బయటకు వస్తాడని చర్చించుకుంటున్నారు. ఏం జరగబోతుందో చూడాలి.