ప్రతి ఒక్కరి లైఫ్ లో జాతర చూడని సందర్భం ఉండదు . పెద్ద సిటీలో ఉన్న, చిన్న‌ ఊరి లో బతుకుతున్న ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయాన్ని మిస్ కారు . అలాంటి గొప్ప ప్రాముఖ్యత జాతరకు ఉంది. ప్రస్తుతం వస్తున్న సినిమాలకు ఇదే సక్సెస్ ఫార్ములాగా మారిపోయింది.  ఎన్టీఆర్ దేవర లో కూడా ముఖ్యమైన కీలక ఎపిసోడ్లో దర్శకుడు కొరటాల జాతర చుట్టూనే డిజైన్ చేశాడు .. ఎన్టీఆర్ కూడా అదిరిపోయే డాన్స్ చేసింది కూడా ఈ జాతర పాటలోనే .. ఇక మూవీ ఇంటర్వల్ కు ముందు వచ్చే కీలక సన్నివేశంలో లీడ్ ఇక్కడి నుంచే వచ్చింది. ఇది థియేటర్లో ఎలా పేలిందో మళ్లీ చెప్పక్కర్లేదు.

ఇక చిన్న సినిమా గా వచ్చిన కమిటీ కుర్రాల్లో ప్రధాన ట్విస్ట్ జాతర మీద పెట్టాడు దర్శకుడు వంశీ .. సినిమాలో ప్రధాన పాత్రలో ఒకరిని అక్కడ చనిపోయేలా చేయడం తో పాటు అక్కడి నుంచి సినిమా ను నడిపించిన తీరు ఎంతో గొప్పగా ఉంటుంది. అలాగే మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కలో సైతం జాతర సెంటిమెంట్ కీలక పాత్ర పోషించునుంది. ఈ సినిమాలన్నీ పక్కన పెడితే పుష్ప 2 లో గంగమ్మ జాతరకు గురించి టీం ఇస్తున్న లిక్స్ అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.

పావు గంటకు పైగా ఈ నేపథ్యంలో ఫైట్ ఉంటుందని అది సినిమాకే హైలెట్ అన్ని అంటూన్న‌రు …  ఇదే క్ర‌మంలో కొత్త తరాన్ని ఒక ట్రెడిషన్ వైపు చూసేలా చేయడమే. ఇప్పటికీ ఎన్నో ఊళ్లలో జాతరలు జరుగుతూనే ఉంటాయి. వాటి కోసమే సెలవు రోజుల్లో స్వంత పల్లెలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. అయినా కథలో భాగంగా వస్తే బాగుంటుంది కానీ ఇదేదో వర్కౌట్ అవుతుందని బలవంతంగా జాతర ఎపిసోడ్స్ పెడితే తేడా కొట్టే రిస్క్ లేకపోలేదు. అలా జరిగిన దాఖలాలు తక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి: